ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రామస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో చిన్నారులు సీత, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాత్రలను చక్కగా పోషించారు. 6వ తరగతి విద్యార్థి దీక్షిత్ శ్రీరాముడి పాత్ర పోషించగా, 4వ తరగతి విద్యార్థిని పల్లవి సీతాదేవి పాత్రలో మెప్పించారు. 4వ తరగతి విద్యార్థి అభ్యుదయ లక్ష్మణుడి పాత్ర పోషించగా, 6వ తరగతి విద్యార్థి హేమంత్ హనుమంతుడి పాత్రలో ఆకట్టుకున్నారు. నర్సరీ విద్యార్థి ధ్రువణ బాలరాముడి పాత్రలో ప్రత్యేకంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు వాసా రమేష్ బాబు, ఉపాధ్యక్షులు మిడిదిడ్డి చంద్రశేఖర్, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ కార్యవాహ పత్తికొండ రాంరెడ్డి, విభాగ సహా కార్యదర్శి కందూరి బాలరాజు, జిల్లా సహా కార్యదర్శి నాగరాజు, సభ్యులు శివరావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి ప్రసన్న లక్ష్మీతో పాటు ఉపాధ్యాయులు దుర్గా భవాని, జ్యోతి, దివ్య, ఉమా మహేశ్వరి, సిబ్బంది స్వాతి, పల్లవి, వసుంధర, డ్రైవర్లు శేఖర్, శివ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.