Take a fresh look at your lifestyle.

కుల దురహంకార దాడులను ఖండించండి -ఘటనకు బాద్యులైన నింధితులను ఖఠినంగా శిక్షించాలి

సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు.

మోత్కూరు ముద్ర న్యూస్:

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో కులవివక్షత కారణంగా రజక కులస్థులపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఖండించాలని, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు అన్నారు. గురువారం రోజున మోత్కూర్ మండల కేంద్రంలో ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ…. స్వాతంత్రం వచ్చి దశబ్దాలు గడచిన దేశంలో ఇంకా ఎక్కువ తక్కువ కులాలంటూ వివక్ష కొనసాగడం దారుణమని, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో మల్లన్నగుడిలోకి టికెట్ లేకుండా ప్రవేశించారనే కారణంతో చాకలి కులస్థులపై కులదురహంకారులు దాడిచేసి రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన నిందుతులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులు, బీసీలు, వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులు ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని విమర్శించ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనను అన్నివర్గాలు ఖండిస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరమని అన్నారు. ఘటనకు బాద్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చెయ్యాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.