- గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు ఆమోదం.
- రెండు కీలక ప్రాజెక్టులకు ఒకే చెప్పిన కేంద్రం.
- ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు జారీ.
- హైదరాబాద్–అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర విభజన చట్టంలోని కీలక అంశాలపై కేంద్రం దృష్టి పెట్టింది.ఏపీ, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి, ఫిబ్రవరి 3న కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉన్నతాధికారుల భేటీ జరిగింది.ఈ సందర్భంగా ఏపీ పునర్విభవజన చట్టంలోని కొన్ని శాఖలకు చెందిన అంశాలను చర్చించారు.రోడ్లు, ఉపరితల రవాణా, బొగ్గు, ఉక్కు గనులు, వ్యవసాయం,పెట్రోలింయ, రైల్వే వంటి ప్రాజెక్టులు,పెండింగ్ అంశాలను సుదీర్ఘంగా మర్చించారు.ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను తెలుగు రాష్టరాలకు కేంద్ర హోంశాఖ తాజాగా పంపింది.ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల పరిధిలోకి కీలక ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరిలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశానికి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఆ సందర్భంగా చర్చించిన అంశాలలో రెండు ప్రాజెక్టుల్లో పురోగతి లభించింది.ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజనపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు, ఇతర పరిష్కారం కాని సమస్యలపై రెండు నెలలకోసారి సమావేశమై చర్చించాలని కేంద్రం ఇటీవల సూచించింది.అయితే, కేంద్రం తాజా నిర్ణయంతో అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజినల్ రింగ్ ఉత్తర భాగం అనుమతులు రానున్నాయి.అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు అనుమతినిస్తూ..డీపీఆర్ కు చర్యలు తీసుకోవాలని రోడ్లు ఉపరితల రవాణాకు సంబంధించిన శాఖకు హోం శాఖ సూచించింది.
- ట్రిపుల్ ఆర్కు ఒకే.
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది.161 కిలోమీటర్ల మేర సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ వరకు ఆరు ప్యాకేజీల్లో చేపట్టనున్న ఉత్తర భాగం నిర్మాణానికి రూ. 7,104.06 కోట్లు మంజూరయ్యాయి.ప్రయాణికుల సౌకర్యం కోసం టోల్ ప్లాజాలు, విశ్రాంతి గదులు, సర్వీస్ రోడ్లు, బస్ బేలు, ట్రక్ బేలతో పాటు మొత్తం 11 అత్యాధునిక ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మించనున్నారు.దీనికి ఇటీవల పలు అనుమతులు రాగా..తాజాగా కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది.దీంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు కీలక దశకు చేరుకున్నట్లుగా మారింది.ప్రస్తుతం నగర చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల అవతల ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు.ఈ రహదారి అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ భాగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని నిపుణులు భావిస్తున్నారు.ఈ ప్రాజెక్టును ఉత్తర , దక్షిణ భాగాలుగా విభజించి నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదాను మంజూరు చేసింది.ఇటీవల ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది.అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రీజినల్ ఎంపవర్డ్ కమిటీ (ఆర్ఈసీ) ఈ అనుమతులను జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా.. తాజాగా కేంద్ర క్యాబినెట్ కూడా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పంపిన మినిట్స్‌లో వెల్లడించారు.ఈ ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించాయి.కాగా,ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, గ్రామాలు అభివృద్ధికి ఇది ఒక వరంలా మారనుంది.ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం మొత్తం ఐదు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా చేపట్టనున్నారు.ప్రతిష్ఠాత్మక భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా..నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఈ కీలకమైన రహదారిని నిర్మించనుంది.ఈ రహదారి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల గుండా వెళుతుంది. ఈ రహదారి డిజైన్‌ను రోడ్లు, భవనాల శాఖలోని నేషనల్ హైవేస్ డివిజన్ అందించిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా రూపొందించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు.ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణంలో ఉత్తర భాగం పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోనుంది. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి నుండి ప్రారంభించి.. తూప్రాన్, గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భారీ రహదారిని మొత్తం ఆరు ప్రత్యేక ప్యాకేజీలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ నిర్మాణం కోసం దాదాపు 1,940 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.భూసేకరణ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఉత్తర భాగం మొత్తం పొడవు 161.518 కిలోమీటర్లుగా నిర్ణయించబడింది.ఈ ప్రతిష్ఠాత్మకమైన ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 7,104.06 కోట్ల భారీ మొత్తాన్ని మంజూరు చేసింది.ఈ రహదారి డిజైన్‌ను రోడ్లు, భవనాల శాఖ నేషనల్ హైవేస్ డివిజన్ నిపుణుల సలహాలు , సూచనలు తీసుకున్న తర్వాత ఖరారు చేశారు.ముఖ్యంగా.. ఔటర్ రింగు రోడ్డుతో పాటు వివిధ జాతీయ రహదారులు, ఇతర ముఖ్యమైన జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక ప్రదేశాలలో ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం టోల్ ప్లాజాలు, విశ్రాంతి గదులు, సర్వీస్ రోడ్లు, బస్ బేలు, ట్రక్ బేలతో పాటు మొత్తం 11 అత్యాధునిక ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మించనున్నారు.ప్రస్తుతం ఈ ఆర్ఆర్ఆర్ నాలుగు లేన్ల రహదారిగా నిర్మించబడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని దీనిని ఆరు లేదా ఎనిమిది లేన్‌లకు విస్తరించే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి.
- అమరావతి టూ హైదరాబాద్.. గ్రీన్‌ఫీల్డ్ హైవే.
ఇదే సమావేశంలో చర్చించిన అనంతరం..అమరావతి–హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలలో భాగంగా ఏపీ, తెలంగాణ రాజధానుల మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ లభించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ రూపొందించడానికి చర్యలు తీసుకోవాలని ఉపరితల రోడ్లు, రవాణాశాఖ అధికారులను హోం శాఖ ఆదేశించింది. దాంతో త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.హైదరాబాద్ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కు సంబంధించి ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని కూడా ఆదేశించారు.అమరావతి ఔటర్ రింగ్ రోడ్, వైజాగ్ నుండి మూలాపేట, విజయవాడ తూర్పు బై పాస్, విజయవాడ–హైదరాబాద్, హైదరాబాద్–బెంగుళూరు హైవేల విస్తరణకు కేంద్రం తాజా నిర్ణయంతో అడుగులు పడ్డాయి. అయితే, ఇటీవల అమరావతికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేసిన అంశాలను సైతం ప్రస్తావించారు. తాజాగా గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కేంద్రం ఆమోదం చెప్పడంతో.. త్వరలోనే డీపీఆర్ పూర్తి కానున్నది.