- బీఆర్ఎస్ పాలనలో సాగర్ ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీసుల పరిధిలో ఉండేది.
- ఇప్పుడు విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ పరిధిలో ఉంది.
- మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ, గుంటూరు సరిహద్దుల్లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు ఆధీనంలోకి వెళ్లిపోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.బీఆర్ఎస్ పాలనలో నాగార్జున సాగర్ లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పరిధిలో ఉండేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అది విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ చేతికి వచ్చిందన్నారు.బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ సీఎంగా ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదని చెప్పారు.సీఆర్పీఎఫ్కు సాగర్ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమే అన్నారు. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు పాలన సాగుతుందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.చంద్రబాబు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో అర్థం కావడం లేదనారు.వయా చంద్రబాబు ద్వారా ఈ ప్రభుత్వం మోడీకి దగ్గరైంది విమర్శించారు.లక్ష మందితో కేసీఆర్ సభకు సిద్ధమైతే కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచి కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.గత పదేళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నారని తెలిపారు. ఇపుడు తెలంగాణ నీళ్లను దొంగలించుకుని పోతున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిపోయింది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదని విమర్శించారు.మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పదవికి ముప్పు ఉంటుందనే రేవంత్ రెడ్డే దాన్ని ఆపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.ఎలాగూ కాంగ్రెస్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని ఆ పార్టీ వాళ్ళే చెబుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.