- ఫుడ్ పాయిజన్ తో 30కి పైగా మానసిక రోగులకు అస్వస్థత.
- ఒకరి మృతి.
- విచారిస్తున్న వైద్యాధికారులు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న 30కి పైగా మంది మానసిక రోగులు మంగళవారం ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కరణ్ అనే రోగి గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందారు.ప్రస్తుతం అస్వస్థతకు గురైన అందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నారు.విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వచ్చిన వైద్యాధికారులు ఫుడ్ పాయిజన్‌పై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.