Take a fresh look at your lifestyle.

జగిత్యాల పట్టణ అభివృద్దే ధ్యేయం ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ముద్ర, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణలోని 20వ వార్డులో రూ.15 లక్షలతో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాన పనులకు బుధవారం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ది నిరంతర ప్రక్రియ అని, యావర్ రోడ్డు కిలో మీటర్ వరకు వెడల్పు చేయడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గొల్లపల్లి రోడ్డు వెడల్పు చేసుకున్నామని అన్నారు. పట్టణ అభివృద్ధి లో అందరూ ప్రజా ప్రతినిధుల పాత్ర ఉందని, పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమన్నారు. పక్కా ప్రణాళిక తో భవిష్యత్ అవసరాల ను ఆలోచన చేసి పట్టణం అభివృద్ధి చేస్తామన్నారు. యావర్ రోడ్డు వెడల్పు కోసం కట్టుబడి ఉన్నామని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల మంజూరుకు హామీ ఇచ్చారనీ తెలిపారు.పట్టణంలో అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత పాటించాలని, అందుకు అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ అనుమల కృష్ణ హరి, అడువాల లక్ష్మణ్, బాలే శంకర్, చెట్పల్లి సుధాకర్, క్యాదసు నాగయ్య, మహేందర్, ఏఈ అనిల్, గిరి, శరత్, ప్రభాత్, రాజ్ కుమార్,రవి శంకర్, మాజీ కౌన్సిలర్ లు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.