Take a fresh look at your lifestyle.

తెలంగాణకు అమ్రపాలి

  • ఏపీ నుంచి వెనక్కి పంపిన క్యాట్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో విధులు నిర్వర్తిస్తూ.. గత కొన్ని నెలల క్రితం ఏపీకి కేటాయించబడ్డ ఐఏఎస్​ కాట అమ్రపాలి విషయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్​) కీలక నిర్ణయం తీసుకున్నది.ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నినెలల క్రితం ఏపీ, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలనూ తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో విధుల్లో చేరారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆమ్రపాలి గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.