ముద్ర,వీపనగండ్ల: యునైటెడ్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ వారు హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో మండల కేంద్రమైన వీపనగండ్ల చెందిన నలుగురు వ్యక్తులు వివిధ పోటీలలో బహుమతులు గెలిచి మార్చి నెలలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగే పోటీలలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన పల్లా రఘునాథ్ రెడ్డి గ పోటీలలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు.10కే రన్ లో మొదటి స్థానం,1500 మీటర్స్ రన్ లో మొదటి స్థానం, 200 మీటర్స్ రన్ లో మొదటి స్థానం గెలుపొంది గోల్డ్ మెడల్స్ ను పొందారు.సంస్కృతిక కళాకారుడు డి కృష్ణయ్య షాట్ పుట్ లో పాల్గొని సెకండ్ ప్రైజ్, రిపోర్టర్ సూర్యనారాయణ ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని రెండో బహుమతి పొందగా, ఆర్ఎంపి వైద్యుడిగా పని చేస్తున్న విష్ణు 800 పరుగు పందెంలో పాల్గొని రెండవ బహుమతి పొందారు.గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని బహుమతులు పొందడంపై మండల ప్రజలు,గ్రామస్తులు అభినందించారు.