ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : కల్వకుర్తి డివిజన్ పరిధిలో ఆప్కారి పోలీసులు సారా తయారీ కేంద్రాలపై ముమ్మరంగా దాడులు చేశారు. బుధవారం చారకొండ,గోకారం,కమాల్ పూర్ గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై మహబూబ్ నగర్ ఎన్ఫోర్స్మెంట్,కల్వకుర్తి ఎక్సైజ్ టీమ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.దాడుల్లో 400 లీటర్ల బెల్లం పానకం,10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. గీత కార్మికులు సారా తయారీకి పాల్పడుతున్నట్లు నమ్మదగిన సమాచారం ఉందని, దాడులు నిర్వహించినప్పుడు దొరికితే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. దాడులలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్సై నాగరాజు,సిబ్బంది దుద్యా,మహేష్,జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.