- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టితోనే సాధ్యం అవుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు మొదటిసారి రాగా మొక్కను అందజేసి, గజమాలతో ఘన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ జనాభా కి తగినట్టు చట్ట సభల్లో హక్కు ఉండాలని, కాంగ్రెస్ పార్టీ అండతో చిన్న కార్యకర్త స్తాయి నుండి మంత్రి గా ఎదగడం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. రాహుల్ గాంధీ ఆదేశంతో రాష్ట్రం లో రేవంత్ రెడ్డి బీసీ కులగణన నిర్వహించారని, దేశంలో ఎక్కడాలేని విదంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. 59 వేల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో ఉండేలా ప్రయత్నం చేస్తానని, రోల్లవాగు,మెడికల్ కాలేజీ,ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతుగా సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ రావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకులు,ఉద్యోగ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
