ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కల్వకుర్తి పట్టణానికి చెందిన కాసుల అరవింద్ చారి కుటుంబ సభ్యులకు గురువారం భారతీయ జనతా పార్టీ నాయకులు రూ, 55,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి సహకారంతో నాయకులు, కార్యకర్తలు తక్షణసాయంగా అందించడం జరిగింది. భవిష్యత్తులో కుటుంబాన్ని అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన మిత్ర ఫౌండేషన్ వారు అరవింద్ చారి ఇద్దరు పిల్లలను పదవ తరగతి వరకు చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.