Take a fresh look at your lifestyle.

హామీలను అసెంబ్లీలో చర్చించాలి ఎమ్మెల్యే రోహిత్ కు సిఐటియు వినతిపత్రం

ముద్ర ప్రతినిధి, మెదక్:
గత ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఈ అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని, సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు కడారీ నర్సమ్మ అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో మాట్లాడాలని గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెల ఐదో తారీకులోపు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, జీతాల పెంపుదల ఉద్యోగ భద్రత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీల ను ప్రభుత్వం అమలు చేయాలని ఆమె కోరారు. గత మూడు నెలల నుండి జీతాలు రాక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు సత్తయ్య, లాలూ ప్రసాద్, బాబు, మరియమ్మ, ఆయమ్మ, దుర్గయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.