Take a fresh look at your lifestyle.

బొక్కల గుట్టలో ఐదో విడత గిరి ప్రదక్షణ

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : బొక్కల గుట్ట గ్రామంలోని ఋష్యమూక పర్వతం చుట్టూ ఐదో విడత గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.ముందుగా దేవతామూర్తుల విగ్రహాలతో ఊరేగింపు సాగించారు. అనంతరం శ్రీ ఋష్యమూక బాలాజీ ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించి పర్వతం చుట్టూ మొక్కలు నాటారు.కాగా గిరిప్రదక్షణలో పాల్గొన్న భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ నిర్మాణం కొరకు వికాస్ తరంగిణి వారు లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బలికొండ కిషన్ నేతృత్వంలో నిర్వహించిన కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ సుభాష్,ఎంపీడీవో రాజేశ్వరి,పీఎస్ విద్యాలత, వికాస్ తరంగణి అధ్యక్షుడు హనుమంతరావు, కిషన్ రావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.