యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: ఇటీవలే జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన కాలనీ బిఆర్ఎస్ కార్యకర్తలను, ఆదివారం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పరామర్శించారు. ఉదయం కాలనీకి వచ్చిన ఆయన కాలని పార్టీ పట్టణ అధ్యక్షులు మేడి సదానందం, వనిత, అధికార ప్రతినిథి గుడెళ్లి రాంచందర్ ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ఇక ఆయన వెంట నాయకులు దాసరి బాలరాజు, మాజీ కార్పొరేటర్లు కొండ్ర స్టాలిన్ గౌడ్, బాదే అంజలీదేవి, నాయకులు పులి రాకేష్, శంకర్, ముక్కెర మొగిలి, సారయ్య నాయక్, ఎరవెల్లి శ్రీనివాస్, రోజా, శకుంతల తదితరులు ఉన్నారు.