Take a fresh look at your lifestyle.

మురికివాడల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు -హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్రం కంటోన్మెంట్ స్థలాలు ఇస్తే ఇల్లు కట్టిస్తాం
ఈ విషయంలో కిషన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించాల

ముద్ర, తెలంగాణ బ్యూరో :

హైదరాబాద్ లోని మురికివాడలను డబుల్ బెడ్ రూంలుగా మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కంటోన్మెంట్ స్థలాలు ఇస్తే ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన అందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్థలం ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ముందుగా స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్థలం లేని వారికి ఒకే దగ్గర 5-6 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు మూడు జిల్లాల కలెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణతో ముందుకు తీసుకుపోతున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్లాసిక్ గార్డెన్స్ లో మారేడుపల్లి లోని ఏసీఎస్ నగర్ ,ఓల్డ్ మారేడుపల్లి,సాయి చరణ్ కాలని, కట్టమైసమ్మ సికింద్రాబాద్ లలోని ఈరోజు 155 మంది అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం లో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం లు పంపిణీ చేస్తామని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో చాలా కాలంగా ఎదురు చూసిన వారికి అర్హత కలిగిన వారందరికి రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. 16 ఏండ్లు వయస్సుపై బడిన ప్రతి మహిళా మహిళా సంఘంలో సభ్యులు కావాలని మంత్రి సూచించారు. అందులో వడ్డీలేని రుణాలు పొంది ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక డ్రైవ్ తీసుకొని హైదరాబాద్ లో ప్రతి మహిళా మహిళా సంఘం లో సభ్యులుగా చేరేలా చర్యలు తీసుకోవాలని మెప్మా అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను బస్సు యజమానులు చేస్తూ వారికి ఆరొందల బస్సులు ఇచ్చామన్నారు.

Leave A Reply

Your email address will not be published.