Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ మీడియా అక్రిడేషన్ కమిటీకి జర్నలిస్టుల ఎంపిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా పలువురు జర్నలిస్టులను ప్రభుత్వం ఎంపిక చేసింది. టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, డైలీ న్యూస్ పేపర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు పలుస విజయ్ కుమార్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిగా జి. సాయిలు సాగర్, ఫోటో జర్నలిస్టు ప్రతినిధిగా నేతాజీ గౌడ్, మీడియం డైలీ న్యూస్ పేపర్ నుండి ఎం. శ్రీనివాసులు, ఉర్దూ డైలీ న్యూస్ పేపర్ నుండి ముబిన్ అహ్మద్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు.


ఇతర యూనియన్ల నుండి
చందు ప్రదీప్ దస్తగిరి వెంకటేష్
ఈ సందర్భంగా జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి అక్రిడేషన్ కమిటీకి ఎంపిక చేసినందుకు తెలంగాణ మీడియా అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.