Take a fresh look at your lifestyle.

స్పూర్తినింపుతోన్న స్పోర్ట్స్​ పాలసీ

  • రాష్ట్ర క్రీడాకారులకు ప్రజాప్రభుత్వం అండ
  • జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా చర్యలు
  • అర్జున అవార్డును అందుకున్న అథ్లెట్ దీప్తి జీవంజి
  • అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : క్రీడాకారుల సంక్షేమం.. ఆ రంగాభివృద్దికి తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రీడాకారులు జాతీయ,అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా మెరుగైన స్పోర్ట్స్ పాలసీతో ముందుకుపోతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్న తెలంగాణ క్రీడాకారిణీ పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజికి ఎక్స్​ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతోన్న క్రీడాకారులను స్పూర్తిగా చేసుకుని మిగతా క్రీడాకారులు ఆయా క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.

కాగా గతేడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము శుక్రవారం జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధాన్య్ చంద్ ఖేల్ రత్న అవార్డును చెస్ విభాగంలో డి.గుకేశ్,షూటింగ్ విభాగంలో మను బాకర్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్ లు అందుకున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన అథ్లెటిక్ క్రీడాకారులు జ్యోతి యర్రాజి, దీప్తి జీవాంజిలు అర్జున అవార్డులు అందుకున్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన క్రీడా పురస్కరాల్లో మొత్తం నలుగురికి ఖేల్ రత్న, 32 మందికి అర్జున్ అవార్డులు ముగ్గురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులను ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.