Take a fresh look at your lifestyle.

వనదుర్గ సన్నిధిలో కలెక్టర్ ప్రతిమా పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఏడుపాయల వన దుర్గా మాతను కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలోనే ఏడుపాయల వన దుర్గా మాత ఆలయం చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఆదివారం, సెలవు దినాల్లో అధిక సంఖ్యలో భక్తులు తాకిడికనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా భక్తులకు సౌకర్యాలు ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రతంగా ఉంచడంలో నిర్వాహకుల సేవలను కలెక్టర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఈవో వీరేశం సిబ్బంది శ్రీనివాస్, అర్చకులున్నారు.

Leave A Reply

Your email address will not be published.