ముద్ర ప్రతినిధి, భువనగిరి :
డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేసే 4వ వార్డు సిపిఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం పోచంపల్లి మున్సిపల్ 4వ వార్డు సిపిఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి గారిని గెలిపించాలని కోరుతూ వార్డు మొత్తం వడ్డేపల్లి యాదగిరి గారితో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ ప్రజలందరూ వార్డులో ఉన్న సమస్యల పైన అవగాహన ఉండి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకుడి గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఓట్ల కోసం డబ్బు, మధ్యం, ఇతర ప్రలోభాలు పెట్టి ఓట్లు దండుకునేవారు ప్రజలకు సేవ చేయరని అన్నారు. పోచంపల్లి మున్సిపల్ పట్టణము ఏర్పడిన నాటినుండి సమగ్రాభివృద్ధి కోసం, కార్మికుల, చేనేత కార్మికుల, వృత్తి దారుల, రైతుల, వ్యవసాయ కూలీల హక్కుల కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమాలు చేపడుతున్న ఉద్యమాలలో కీలకంగా పనిచేస్తున్న వడ్డేపల్లి యాదగిరిని ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి, సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కోట రామచంద్రారెడ్డి, మాజీ జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ల లింగారెడ్డి, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, పట్టణ, మండల కమిటీ సభ్యులు బుగ్గ లక్ష్మయ్య, పొన్నమోని కృష్ణ, పత్తి బిక్షపతి పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.