Take a fresh look at your lifestyle.

బాల్య వివాహం అడ్డుకట్ట – ఎంగేజ్మెంట్ సమయంలో పూజారి పరార్ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అధికారుల హెచ్చరిక

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు చేయరాదని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల ఇంకా ఈ నిబంధనలు ఉల్లంఘించే ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో 17 సంవత్సరాల బాలికకు ఎంగేజ్మెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు కాల్ వచ్చింది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు యశ్వంత్, ప్రమీల సంఘటన స్థలానికి చేరుకుని, 18 సంవత్సరాలు నిండని బాలికకు ముహూర్తం పెట్టడం చట్ట విరుద్ధమని తల్లిదండ్రులకు, పూజారికి కఠినంగా హెచ్చరించారు.

అధికారులు చేరుకున్న విషయం తెలుసుకున్న పూజారి అక్కడి నుంచి పరార్ అయ్యారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులకు వివాహ వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలని స్పష్టం చేశారు.

అలాగే, బాల్య వివాహాలు జరిపితే 2006 బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష వరకు జరిమానా విధించబడుతుందని అధికారులు తెలిపారు. వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా బాలిక మరియు ఆమె కుటుంబ సభ్యుల నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. భవిష్యత్తులో వయస్సు నిండకముందే వివాహం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.