Take a fresh look at your lifestyle.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి 

  • ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సామాజిక సమగ్రతను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి వారి ఆద్వర్యం లో జగన్నాధ రథ యాత్ర ప్రారంభం సందర్భంగా జగిత్యాల రోటరీ క్లబ్ వద్ద  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు అడువల లక్ష్మణ్, చెట్పల్లి సుధాకర్, డిష్ జగన్,శివ కేసరి బాబు, దుమాల రాజ్ కుమార్, కుసరి అనిల్, పిట్ట ధర్మరాజు, భోగ చిన్న జి ఆర్, కత్రోజ్ గిరి, రంగు మహేష్, పోతునుక మహేష్, రవి శంకర్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.