Take a fresh look at your lifestyle.

నెలవారీ తనిఖీలో భాగంగా ఈవీఎం గోదాం పరిశీలన

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం ఈవీఎం (EVM) గోదాంను పరిశీలించారు. ఈ తనిఖీలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

గోదాంలో భద్రపరచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ సవివరంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, డబుల్ లాక్ వ్యవస్థ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే, గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది పనితీరును కూడా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటంలో ఈవీఎంల భద్రత అత్యంత ముఖ్యమని తెలిపారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.