Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం-మరో 15 రోజుల్లో ప్రారంభం -ఈహెచ్ఎస్ ట్రస్టు భేటీలో కీలక నిర్ణయం

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మరో 15 రోజుల్లో రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆ పథకానికి చెల్లించేలా నిర్ణయం తీసుకున్నది.ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యపై గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఈహెచ్ఎస్ ట్రస్టు సమావేశం జరిగింది. సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగుల సంఘాలు హాజరైన ఈ సమావేశంలో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులు చెల్లించిన అంతే మొత్తం ప్రభుత్వం కూడా చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేయాలని సీఎస్ కె.రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.