Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ జిల్లా ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల డీఈఓ రమేష్ కుమార్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ విడుదల చేశారు.

వివరాల ప్రకారం,
6వ తరగతి ప్రవేశ పరీక్ష 19-04-2026 తేదీన ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది.
7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు అదే రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతాయి.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అలాగే అభ్యర్థులు అవసరమైన పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

సమయపాలన పాటిస్తూ పరీక్షలకు హాజరవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.