Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ ను బీజేపీ లో వీలనం చేసేందుకు కుట్ర

  • పార్టీపై  దిక్కారం స్వరం పెంచిన కవిత
  • కేటీఆర్ పై పరోక్షంగా  విమర్శల దాడి
  • దానికి అడ్డుగా ఉన్నందువల్ల తనను దూరం పెడుతున్నారు
  • పెయిడ్ ఆర్టిస్తుటలతో తిట్టిస్తున్నారు
  • కోవర్టులు.. లేఖ లీక్ వీరులు ఎవరో తేలాలి
  • కేసీఆర్ ను తప్ప.. మరెవరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని స్పష్టీకరణ

ముద్ర, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీలో కవిత పెట్టిన చిచ్చు పతాక స్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇక ఏ నిమిషంలోనైనా అది విస్పోటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత సైతం ఇక  పార్టీతో తాడోపోడే తేల్చుకునేందుకు సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది. పరోక్షంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే తన దారి తాను చూసుకుంటున్న వైనాన్ని వెల్లడించారు. మరోవైపు పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఇందుకు తాను అడ్డుగా ఉన్నందువల్లే తనను దూరం పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.పెయిడ్ ఆర్టిస్తులతో ఉద్దేశపూర్వకంగా తనను తిట్టిస్తున్నారని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి వాటికి భయపడే రకం తాను కాదని హెచ్చరించారు.పైగా తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని అన్నారు.పార్టీలో కేసీఆర్ ను తప్ప మరెవరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని అన్నారు. తనకు ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు.

గురువారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో కవిత మాట్లాడుతూ,పార్టీ అధిష్టానంపై దిక్కార స్వరం మరింతగా పెంచారు. ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ను ఉద్దేశించి మాటలు తూటాలు పేల్చారు.పార్టీలో తనకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, మరో నాయకుడు లేరంటూ తేల్చి చెప్పారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని  వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు.నాకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా ఉందా అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని కొంతమంది చెప్పుకుంటున్నారు.కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా అంటూ సొంత పార్టీ లీడర్లను కవిత నిలదీశారు.తాను కేసీఆర్ కు అంతర్గతంగా రాసిన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. లేఖ లీక్ వ్యవహారంలో బీజేపీ కోవర్టులు బీఆర్ఎస్ లో ఎవరని ప్రశ్నించారు. పార్టీ అంతర్గత సమస్యలను ఇంటర్నల్ ఫోరంలోనే మాట్లాడుకోవాలన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కవిత ఎద్దేవా చేశారు.ఫోరం లోపల ఏముందని అందుకే బయట మాట్లాడుతున్నానని అన్నారు.  తన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాలంటే..గ్రీకు వీరుల్లాగా నాపై విమర్శల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. సొంత బిడ్డపై డబ్బులిచ్చి మరి తిట్టిస్తున్నారని.. అటువంటి బయటి వాళ్లపై ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సోషల్‌ మీడియాలో తనను టార్గెట్‌ చేశారన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని ముందు ఒకటి వెనుక ఒకటి ఉండదన్నారు. నేను కేసీఆర్ కంటే తిక్కదాన్ని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా జోలికి వస్తే బాగుండదని..అసలే నేను మంచిదాన్ని కాదన్నారు. కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నాం అని కార్టూన్లు వేసుకొని చెప్పుకుంటున్నారని..కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్ళా మీరు అని కవిత ప్రశ్నించారు. గత  25 ఏళ్ల నుంచి కేసీఆర్ కు లేఖలు రాస్తున్నానని..వందల లేఖలు రాశానని ప్రతిసారి లేఖ చూడగానే కేసీఆర్ చదివి చించేస్తారని.. కానీ ఈసారి ఏమైందో ఆ లేఖ ఎలా బయటకి వచ్చిందని ప్రశ్నించారు.
  • కావాలనే దూరం పెడుతున్నారు.
బీజేపీలో బీఆర్ ఎస్ ను విలీనం చేసేందుకు కుట్ర జరుగుతుందని..దీనిని తాను వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తున్నందుకే నన్ను దూరం పెడుతున్నారని కవిత ఆరోపించారు.తాను జైల్లో ఉన్నప్పుడే విలీన ప్రతిపాదన తెస్తే నేను అప్పుడే వ్యతిరేకించానని తెలంగాణ సాధించిన పార్టీని మరో పార్టీలో విలీనం చేయాల్సిన అవసరం ఎందుకని వ్యతిరేకించడం జరిగిందన్నారు.మళ్లీ ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం వంద శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.తాను ఉంటే అది కుదరదని భావించే కేసీఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారని  ఆరోపించారు.తనను కేసీఆర్ కు దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసన్నారు.కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కవిత ఆరోపించారు.కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదని నేను కాంగ్రెస్ పార్టీలో 2013లో మాట్లాడటం జరిగిందని అప్పటి నుంచి వారితో మాటలు లేవన్నారు.అయినా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని ఆ పార్టీ బాగుంటే, రాహుల్ గాంధీ బాగుంటే దేశంలో బీజేపీ ఇన్నిసార్లు గెలవదని కవిత అభిప్రాయపడ్డారు.నాకు కొత్త పార్టీ ఆలోచన ఎందుకని ఉన్న పార్టీని కాపాడుకుంటే సరిపోతుంది కదా అని వ్యాఖ్యానించారు.
  • అందుకే జాగృతి నుంచి చేస్తున్నా.
జాగృతిని స్వంతగా డబ్బుతో నడిపిస్తున్నానని, వాళ్ళ డబ్బులు తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు. పార్టీ కోసం చేయాల్సిన సగం పని నేను జాగృతి తరుపున చేస్తుంటే తనపై విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. నిజానికి తాను  పదవి అడగలేదు పైసలు అడగాలేదన్నారు.తన వద్ధకు వచ్చిన మధ్యవర్తులతో తాను అలా అడినట్లుగా ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.గతంలో జైలుకు వెళ్లినప్పుడు నాపై ఆరోపణలు వచ్చినప్పుడు  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు చెప్పగా..ఆయన వద్ధన్నారని కవిత వెల్లడించారు. తాను తెలంగాణ ఉద్యమ సమయంలో కడుపులో బిడ్డను పెట్టుకుని ఊరూరు తిరిగానని..తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే  బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మన పార్టీ నేతల కాలేజీలు కూలగొడుతుంటే ఏం చేస్తున్నారన్నారు. ఈ పరిణామాలపై కేసీఆర్ ను ఎప్పుడు కలిసేది ఇప్పుడే చెప్పలేనని..ఇందుకోసం నేను డెడ్ లైన్ ఏమి పెట్టలేదన్నారు.
  • అదంతా ఉత్తుత్తిదే.
తాను కాంగ్రెస్ పార్టీతో ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తానని పత్రికల్లో వచ్చిన వార్తలను కవిత ఖండించారు. తనను పార్టీ నుంచి పొమ్మన లేఖ పొగపెడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అందుకే  ఇలాంటి తప్పుడు కథనాలు మీడియాలో వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు తాను ఎవరి సంప్రదించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.కాంగ్రెస్‌ పార్టీ ఓ మునిగిపోయే నావ అని అని అన్నారు. అలాంటి పార్టీతో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదని  తేల్చిచెప్పారు.
  • ట్వీట్లు చేస్తే సరిపోతుందా?
కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేస్తున్నారన్నారు కవిత విమర్శింతారు.తాను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయనని, హుందాగా ఉంటానని చెప్పుకొచ్చారు. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసని కవిత తెలిపారు.  కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పనులు చేయాలని ట్వీట్లు చేస్తే సరిపోతుందా? అని  ప్రశ్నించారు. పార్టీ చేయాల్సిన సగం పనులు తాను జాగృతితో చేస్తున్నానని వెల్లడించారు. దీంతో  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని కవిత చెప్పకనే చెప్పారని అర్ధం అవుతోంది.
  • షోకాజ్ నోటీసులు?
బీజేపీలో,  బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారంటూ కవిత  వ్యాఖ్యలపై  పార్టీ అధిష్టానం  తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని భావిస్తోంది.ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోని పక్షంలో పార్టీ శ్రేణులకు తప్పుడు సమాచారం వెళ్లనుందని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కవితకు  ఏ క్షణంలోనైనా షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.