Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభం

 

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్:

మార్చి 15 నుంచి ద్వితీయ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ క్లాసులు
ఆదివారాలు, రెండవ శనివారాల్లో తరగతులు నిర్వహణ
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచన

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు ద్వితీయ, నాల్గవ మరియు ఆరవ సెమిస్టర్ తరగతులు మార్చి 15వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, అంబేద్కర్ సార్వత్రిక అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఎం. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఇకపై ప్రతి ఆదివారం మరియు రెండవ శనివారం రోజుల్లో తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు.
మరింత సమాచారం కోసం అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ విద్యార్థులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.