గొల్లపల్లి,ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాఘవపట్నం గ్రామానికి చెందిన ఓడ్నాల మల్లేశం, కొలిపాక రాజేశం అనారోగ్యం ఇతర కారణాలతో కొద్ది రోజుల క్రితం మృతి చెందగా వారి ఇరు కుటుంబాల ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో మండల పద్మశాలి సంఘ సభ్యులు అండగా మేమున్నామంటూ వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ఆర్థిక సహకారం అందించి అండగా ఉండాలని వారు కోరారు.మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి తో ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు అండగా ఉండాలన్నారు.మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించిన దాతలకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందోలి మాజీ సర్పంచ్ అలిశెట్టి రవీందర్,రాపల్లె మాజీ ఎంపిటిసి కొక్కుల భూమయ్య, మండల పద్మశాలి సంఘం కార్యదర్శి అంకం భూమయ్య, గొల్లపల్లి పట్టణ అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి, కోశాధికారి అంకం లింబాద్రి, రాఘవపట్నం మాజీ ఉపసర్పంచ్ ఓడ్నాల ఆంజనేయులు, సంఘం అధ్యక్షులు వెంగల్ దాస్ మల్లేశం, ప్రధాన కార్యదర్శి అంకం గణేష్, కొలిపాక రాజేశం, కోలిపాక నారాయణ, కొలిపాక రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
