ముద్ర, చేర్యాల : పట్టణానికి చెందిన బొడ్డు భరత్ (20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన బొడ్డు భరత్ తోటి మిత్రులతో కలిసి కారులో ఏపీలోని అరుణాచలం లో ఉన్న ఆలయాన్ని దర్శనం చేసుకొని తిరిగి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ఏడుకొండల స్వామి దర్శనం కోసం వెళ్తున్న సమయంలో చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బొడ్డు భరత్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా చిత్తూరు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిగా ఉంది.