ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్ దివ్య దర్శన్ రావు (ఎంపీడీవో సుల్తానాబాద్) ఎన్నికయ్యారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్‌పి సిఇఒ కె నరేందర్ పర్యవేక్షన లో ఎన్నికలు ఎకగ్రీవంగా జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా కే శ్రీనివాస్ (ఎంపీడీవో, పెద్దపల్లి), కోశాధికారిగా ఎం సురేష్ (ఎంపీడీవో ముత్తారం), ఉపాధ్యక్షులుగా బి శైలజ (ఎంపీడీవో, రామగిరి), ప్రచార కార్యదర్శిగా జి తిరుపతి (ఎంపీడీవో, ఓదెల), అసోసియేట్ సెక్రటరీగా రామ్మోహనాచారి (ఎంపీడీవో, పాలకుర్తి), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వై భాస్కరరావు (ఎంపీడీవో ఎలిగేడు), ఐ ప్రవీణ్ కుమార్ (ఎంపీడీవో ధర్మారం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.