(ముద్ర , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
సంత్ సేవాలాల్ జీవితం అందరికీ ఆదర్శనీయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని ఉపగడ్డ తండాలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సబితారెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులకు ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి , స్థానిక బీఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బంజారా సంఘాల నాయకులు పాల్గొన్నారు