ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఎంపికైన వీరశైవ లింగాయత్ సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం జిల్లా వీరశైవ లింగ సమాజ మహిళా సంఘ అధ్యక్షురాలు పట్లోళ్ల అరుణ అశోక్ ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన గ్రామ సర్పంచులు, ఉపసర్పంచుల సన్మానించగా, నారాయణఖేడ్, జోగిపేట్, సదాశివపేట, సంగారెడ్డి, పటాన్ చెరువు ,జహీరాబాద్ మున్సిపాలిటీల పరిధిలో ఎంపికైన వార్డు మెంబర్లకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు , జిల్లా వీరసేవ లింగ సమాజ సభ్యులు సన్మానించారు. జిల్లాలో లోని వీరశైవ లింగాయత్ సమాజం అభివృద్ధికి కృషి చేయాలని పలువురు వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు బి.బి.పాటిల్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి,జిల్లా వీరసేవ లింగ సమాజ అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింలు జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన పురుషులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
