Take a fresh look at your lifestyle.

రహదారి నిర్మాణ పనులను ప్రారంభించాలని వినతి

కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రధాన రహదారి నుండి మాడల్ స్కూల్ వరకు మంజూరు అయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కథలాపూర్ ఎంపీడీఓ కు వినతిపత్రాన్ని అందించారు. ప్రభుత్వం ఈ రహదారి కోసం1 కోటి 30 లక్షలు మంజూరు. చేసిందని, భూమి పూజ చేసి 8 నెలలు గడిచినా పనులు ప్రారంభించలేదని మంది పడ్డారు.మోడల్ స్కూల్, కస్తూరిభా స్కూల్, జూనియర్ కళాశాలకు వెళ్లే దారిలో విద్యార్థులకు వర్షం కురిసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు వెంటనే ప్రారంబించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, గాంధారి శ్రీనివాస్, ధర్మపురి జలందర్, గడ్డం జీవన్ రెడ్డి, ప్రసాద్, కాసోజి ప్రతాప్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.