Take a fresh look at your lifestyle.

ఆర్‌ఎఫ్‌సిఎల్‌ను సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  • ఉత్పత్తి, ఎరువుల లభ్యతపై సమీక్ష.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం రామగుండం ఫెర్టిలైజర్స్ (ఆర్ ఎఫ్ సి ఎల్) కెమికల్స్ లిమిటెడ్ సంస్థను సందర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతపై ప్రజలలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, సంస్థలో ఉత్పత్తి స్థాయిలు, లింకేజ్,డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా ఎంపీ ఆర్ ఎఫ్ సి ఎల్ జనరల్ మేనేజర్ తో సమావేశమై ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుత రోజువారీ ఉత్పత్తి స్థాయి, యూరియా సరఫరా లింకేజ్ విధానం రాష్ట్రానికి పంపిణీ అవుతున్న మెట్రిక్ టన్నుల పరిమాణం, నిల్వలు, రవాణా,రైతులకు డైరెక్ట్ డెలివరీ వంటి అంశాలపై సమీక్షించారు.అలాగే ఎంపీ యూరియాతో పాటు ఇతర ఎరువుల ఉత్పత్తిపై కూడా వివరాలు అడిగితెలుసుకున్నారు. అవసరమైతే ఫాస్ఫేటిక్,మిక్స్‌డ్ ఫెర్టిలైజర్స్ వంటి ఎరువులఉత్పత్తి పై దృష్టి పెట్టాలని సూచించారు. చారిత్రాత్మకంగా ఆర్ ఎఫ్ సి ఎల్ ను తిరిగి తెరిపించిన డా.గడ్డం వివేక్ వెంకటస్వామి,అప్పటి పెద్దపల్లి ఎంపీగా కీలక భూమిక పోషించారు.సంస్థ ప్రారంభానికి కావలసిన రూ.10,000 కోట్లు రుణమాఫీ జరిగేలా కేంద్రాన్ని ఒప్పించి,ప్రాంత యువతకి వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశ గా ఆర్ ఎఫ్ సి ఎల్ ను పునరుద్ధ రించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ”రైతులకు ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయం చేస్తాం.కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే చర్చిస్తా ఆర్ఎఫ్ సీ ఎల్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల సమస్యలు, వేతనాలు,భద్రత అంశాలపై కూడా అధికారులతో చర్చించి, అవసరమైన మద్దతు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.