మనిషి జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నత వ్యక్తి డా, బీఆర్ అంబేద్కర్-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
– చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం
– డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ ఖ్యాతి పొందారు
బడుగు, బలహీన వర్గాల వారికి రాజ్యాంగాన్ని నిర్మించి మనిషి జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నత వ్యక్తి డా, బీఆర్ అంబేద్కర్ అని చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం అని నిరూపించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు రుణపడి ఉంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం డాక్టర్,, బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖమ్మం క్రాస్ రోడ్ కూడలిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభా వేదికపై ఏర్పాటు చేసిన డా, బీఆర్ అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మున్సిపల్ చైర్మన్, అడిషనల్ ఎస్పీ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. డాక్టర్,, బి.ఆర్ అంబేద్కర్ విద్యాభ్యాసం నుండి కుల వివక్షత ఎదుర్కొన్నారని, అలాంటి వివక్షతను తొలగించాలన్న ఆలోచనతో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధికి హక్కులు కల్పించే లక్ష్యంతో
బడుగు బలహీన వర్గాల వారికి సమాన హక్కులు సాధించాలన్న ద్వేయంతో రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ కు మనము ఋణపడి ఉంటామని ఉద్బోధించారు. ప్రపంచంలో ఉన్న గొప్ప చదువులు చదువుకొని న్యాయ, ఆర్థిక, సామాజిక, సాంఘిక వంటి అనేక శాస్త్రలు చదివారని, లండన్ లో ఎకనామిక్స్ చదివి ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి సరైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కల్పించారని, అంతేకాకుండా అందరికి సమానంగా మానవహక్కులు కల్పించారని అన్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం రావడానికి మనమందరం ఇంకా కృషి చేయాలని, హక్కుల కోసం అందరూ బాధ్యత వహించాలని, విద్య ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన, బడుగు, బలహీన, వెనుకబడిన, మైనార్టీల వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టిందని, తొండ, చిలుకూరు, గడ్డిపల్లి లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఒక్కొక్క స్కూల్ కు రూ. 200 కోట్ల ఖర్చు చేస్తుందని వివరించారు. అదే విధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
జిల్లా ఎస్పీ కె నరసింహ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, గొప్ప మహానీయుడు, అని కొనియాడారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలతో పాటు స్త్రీలకు కూడ అనేక హక్కులు కల్పించారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత మాట్లాడుతూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని మహిళా రిజర్వేషన్లు, మహిళలు చదువుకోవడానికి కూడా అనేక అవకాశం కల్పించారన్నారు. ల
అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాచరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ బహుమతులు అందజేశారు.
తదుపరి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99) రోజుల కార్యక్రమంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రత గురించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా రవాణా అధికారి రోడ్డు భద్రతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి తదుపరి ఫ్లెక్సీలు, చార్టులు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి కొల్లి లత, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీఉద్దీన్, జిల్లా అధికారులు, సూర్యాపేట తాసిల్దార్ కృష్ణయ్య, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డిసిసి జిల్లా ప్రెసిడెంట్ గుడిపూడి నరసయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, సీనియర్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, నాయకులు , చింతలపాటి చిన్న శ్రీరాములు, జీడి బిక్షం, ఎర్ర వీరస్వామి, ములకలపల్లి రాములు, డాక్టర్ రామ్మూర్తి, పల్లెటి లక్ష్మణ్, టిఎన్జీవోస్ సెక్రటరీ దున్న శ్యామ్, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వివిధ సంఘాల నాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.