Take a fresh look at your lifestyle.

హరీష్ రావుకు హైకోర్టులో ఊరట

  • ఎన్నికల పిటిషన్ కొట్టివేత.

ముద్ర, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు చెల్లదంటూ కాంగ్రెస్ నేత జి. చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. హరీష్ రావు తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని గౌడ్ ఆరోపించారు. అయితే ఆయన కోర్టుకు సమర్పించిన ఆధారాలు సరిపోకపోవడంతో పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.