Take a fresh look at your lifestyle.

యాదాద్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా…

దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం ముందు నిరసన..
ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం గల కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి స్ధానిక నిరుద్యోగులకు చెందేలా నూతన టెండర్లు వేయాలని కోరుతూ యాదాద్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగులు శుక్రవారం హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం ముందు ప్లకార్డులతో ధర్నా నిర్వహించి అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రావు, రెవెన్యూ అండ్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ లను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ కిరాయితో కొండపైన దుకాణాలు నిర్వహిస్తూ వాటిని ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా అధిక రేట్లకు అమ్ముతూ భక్తులను ఇబ్బంది పెడుతున్న వర్తకసంఘాన్ని తక్షణమే రద్దు చేస్తూ టెండర్లు వేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. గతంలో కేవలం 30,40 షాపులే ఉండగా రాజకీయ పలుకుబడితో వాటిని ఇప్పుడు 114 షాపులుగా పెంచారని, రాజకీయ, అధికార బలంతో ఇష్టం వచ్చిన విధంగా ఈ షాపులను కేటాయిస్తున్నారని మండిపడ్డారు. స్వామివారి అభివృద్ధిలో భాగంగా వీళ్లు ఎటువంటి ఆస్తులు కోల్పోలేదు, స్వామి వారి కోసం ఎంతోమంది వారి ఇండ్లను భూములను కోల్పోగా వారికి ఎటువంటి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వీరికి కొండక్రింద నూతనముగా కొన్ని కోట్లు ఖర్చు చేసి దుకాణాలను నిర్మించడం జరిగిందని, ఇట్టి వర్తక సంఘం వల్ల దేవస్థానానికి, భక్తులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. తక్షణమే వర్తక సంఘాన్ని రద్దుచేసి స్థానికులకు అందుబాటులో ఉండే విధంగా టెండర్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, బండ రామస్వామి, దేవపూజ అశోక్, పల్లపు బాలయ్య, దండబోయిన వీరేష్, పబ్బాల ఉప్పలయ్య, మిరియాల కృష్ణ, ఆకుల అనిల్, బండి అనిల్, వంగపల్లి అరుణ్, మందోజు నరేష్, కొన్నె సంజీవ, కర్రె ప్రవీణ్, దార నవీన్, గోపగాని ప్రసాద్, జోరిగళ్ల ప్రశాంత్, కర్రె శ్యామ్, గుండు కుమార్, ఆరె కుమార్, దార క్రిష్ణ, పల్లపు రాజు, శ్రీనాథ్, వంశీ, రాజు, విజయ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.