Take a fresh look at your lifestyle.

నల్లమల లో మంత్రి పొంగినేటి పర్యటన

  • ఇందిరమ్మ పథకం ద్వారా 536 చెంచు కుటుంబాలకు ఇండ్లు.
  • రాష్ట్రవ్యాప్తంగా చెంచు గిరిజనులకు అదనంగా 27,వేల ఇందిరమ్మ ఇండ్లు.
  • చెంచు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ.
  • ఇందిరమ్మ పథకం తో గిరిజన పేదలకు సొంత గృహ కల.
  • ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు భద్రతా భావం.
  • ఇందిరమ్మ ఇండ్లతో ఆడబిడ్డల చిరకాల కోరిక నెరవేరు.
  • అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడం మా ప్రభుత్వం లక్ష్యం.
  • తెలంగాణకు వచ్చే నదీ జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకొనేది లేదు.
  • రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెంచులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆదివాసి గిరిజన పేదింటి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, ఇది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లు పేర్కొన్నారు.సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, లతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అచ్చంపేట, కొల్లాపూర్, నియోజకవర్గాల పరిధిలోని అమ్రాబాద్ మండలం, మన్న నూరు, మాచారం, అచ్చంపేట మండలం అక్కారం, చందాపూర్, పులి తీగల బండ, అయినోలు, చౌటపల్లి, గుంపన్పల్లి, లింగాల మండలం లింగాల, అప్పయ్యపల్లి, ఎర్ర పెంట, పద్మన్ పల్లి, వడ్డీ రాయవరం, దారారం, సురాపూర్, బల్మూరు మండలం, బిల్లా కాల్, ఆంబగిరి, చెంచుగూడెం, బల్మూర్, పదర మండలం పెట్రాల్ చేను, చిట్లం కుంట, వంకేశ్వరం, మద్దిమడుగు, పల్లె్రూట్ పెంట, కొల్లాపూర్ నియోజక వర్గంలోని నార్లాపూరు, అమరగిరి,మొలచింతలపల్లి, పెద్దకొత్తపల్లి యాపట్ల దేది నోనిపల్లి, మారేడుమాన్ దీన్నే, మరికల్ గ్రామాల్లో నివసించే 536 మంది చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్రలో పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుతోందని మంత్రి అన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్ల‌కు నోచుకోలేదని వారి సొంతింటి క‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం సాకారం చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర స‌మ‌గ్ర గిరిజ‌నాభివృద్ధి సంస్ధ (ఐటిడిఎ) లో ప‌రిధిలోని 21 నియోజకవర్గాలలో విడతలవారీగా 13,266 చెంచు కుటుంబాల‌ను ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు జరుగుతాయని, నేరుగా లబ్ధిదారుల ఖాతాలో విడుదల చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో నిర్మించే ఈ ఇండ్లు సామాన్య ప్రజల ఆర్థిక భద్రతకు, గౌరవప్రదమైన జీవనానికి బలం అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిర్మాణ సంబంధిత సదుపాయాలు, మరియు మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తోందని తెలిపారు.ఈ పథకం వల్ల పేదవారిలో భద్రతా భావం పెరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిజంగా సామాజిక న్యాయం సాధించే దిశగా ఒక గొప్ప ముందడుగు ని తెలిపారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని, ఇండ్లు కట్టుకోవాలనే ఆడబిడ్డల చిరకాల కోరికని ఇందిరమ్మ ఇండ్ల రూపం లో ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేయం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విడతలో ఇండ్లు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహ పడవద్దు.రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాము. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు ఇస్తున్నాము. ప్రతి లబ్ది దారునికి ఇందిరమ్మ ఇల్లు లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం కేవలం ప్రకటనలకి పరిమితమైందని, పేద వానికి ఎటువంటి లబ్ది చేకూరలేదని అన్నారు, ప్రజానీకం ని మోసం చేసిందన్నారు. ప్రతి ఏడాది కి ఒక్కో నియోజక వర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు. అదనంగా మరో 1500 ఇండ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు విడతల్లో డబ్బు నేరుగా లబ్ధిదారులకు అందజేస్తామని, మొదటిగా బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు, రూఫ్ లెవల్ స్థాయికి మరో లక్ష రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు, గృహప్రవేశం నాటికి లక్ష రూపాయల చొప్పున మొత్తం ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలోని ప్రతి సోమవారం జమ చేస్తామని, మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రభుత్వం హామీ ఇవ్వని పనులను కూడా పూర్తి చేసిందని గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని,గత ప్రభుత్వం తమ 10 సంవత్సరాల పాలనలో చేయనటువంటి అభివృద్ధి పనులు కేవలం ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పది మాసాల్లోనే అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి సంక్షేమ పథకాలతో అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయం దండగ అన్న గత పాలకుల మాట అయితే, వ్యవసాయాన్ని పండగల చేసి చూపించిన ఘనత మా ప్రభుత్వానిదే అని, దేశంలోనే ఎ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి పనులు కేవలం ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పది మాసాల్లోనే పూర్తి చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రప్రథమంగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దక్షిణ తెలంగాణ జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు పుష్కలంగా అందించేందుకు గోదావరి జిల్లాలను తేవాలని ప్రాజెక్టులు మొదలుపెడితే, గత ప్రభుత్వం ధన దాహానికి ప్రత్యేకంగా కాలేశ్వరం తో అవినీతికి పాల్పడ్డారని మంత్రి గత ప్రభుత్వంపై విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాకింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకొనేది లేదని మంత్రి స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతన్న ఆదుకునేలా రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసేలా దేశస్థాయిలోనే ప్రథమంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో పాటు రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీని ప్రభుత్వం మాఫీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చెంచు రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని లాంఛనంగా ఇదే ప్రాంతంలో ప్రారంభించారని, వసాయాన్ని పండగల మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు.ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్తుస్తున్నాం,ఏడాదిన్న‌రలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలను అమ‌లు చేశాం,హామీలను నెరవేర్చడంలో గ‌త ప్రభుత్వం విఫలమైంది,చెంచుల‌కు ఒక్క ఇళ్లైనా క‌ట్టించి ఇచ్చారా ,బీడు భూముల‌కు కృష్ణా నీళ్ల‌ను మ‌ళ్లిస్తామ‌ని చెప్పి, సాగునీరు ఇవ్వ‌లేదు,మ‌న్న‌నూర్ లో చెంచుల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాల పంపిణీలో మంత్రి జూప‌ల్లి,మాది మాటల ప్రభుత్వ కాదు, చేతల ప్రభుత్వం అని ఇది ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వ పాలనలో తెలంగాణలోని నిరుపేద కుటుంబాలకు నేడు సొంత ఇంటి కల నెరవేరిందని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారికి వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

గ‌త ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లకు ఎన్నో ఆశ‌లు కల్పించింద‌ని, కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయమాటలతో ప‌దేళ్ల కాలం వెళ్లదీసిందన్నారు. అధికారంలో ఉన్న 10 ఏండ్ల‌లో రూ. 8 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి ప్ర‌జ‌ల నెత్తిన భారం మోపారని తెలిపారు. నిరుద్యోగ భృతి, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టిస్తామ‌ని చెప్పి చెంచుల‌కు ఒక్క ఇళ్లైనా క‌ట్టించి ఇచ్చాడా అని ప్ర‌శ్నించారు. కృష్ణా నది నీళ్ల‌ను బీడు భూముల‌కు మ‌ళ్లిస్తాన‌ని చెప్పి.. పదేండ్లలో గత పాలకులు సాగునీరు ఇవ్వలేదని ద్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం ఈ ఏడాదిన్న‌ర పాల‌న‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తుంద‌ని చెప్పారు. ఇది మాట‌ల ప్ర‌భుత్వం కాద‌ని, చేత‌ల ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. స్వ‌ల్ప కాలంలోనే ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రూ. 500కే స‌బ్సిడీ గ్యాస్, 200 యూనిట్ల లోపు ఉచిత క‌రెంట్, పేద‌ల‌కు స‌న్న‌బియ్యం, రైతు రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, స‌న్నాల‌కు రూ. 500 బోన‌స్, ఇలా అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామ‌ని వివ‌రించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంద‌ని, 10 ఏండ్లు అధికారంలో ఉండేది ఈ ప్రభుత్వ‌మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. చెంచులు త‌మ పిల్ల‌ల‌ను బ‌డికి పంపించి, విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. విద్య‌తోనే భ‌విష్య‌త్ కు భరోసా అని అన్నారు.జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా చేపడతామని, ఇప్పటికే జిల్లాలో 11,622 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో జీవించే చెంచులకు 890 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.నేడు మంత్రి చేతుల మీదుగా 536 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ..నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల్లో జీవిస్తున్న చెంచు ప్రజల కలలను సాకారం చేస్తూ నేడు రాష్ట్ర ప్రభుత్వం నల్లమల్ల ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలు సొంత గూడు కట్టుకునేలా కృషి చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎంతో కాలం నుండి ఇల్లు లేక పూరి గుడిసెల్లో జీవిస్తూ ఎండకు, వానకు, చలికి ఇబ్బందులు మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్న ప్రజల కోరికను నెరవేర్చిల ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని తెలిపారు. అందుకు నియోజకవర్గ ప్రజల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో రెవెన్యూకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు.

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం వివిధ పధకాలని ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం పేద ప్రజలకు అందజేస్తుందన్నారు.నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,చెంచుల‌కు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఇందిరమ్మ పట్టాలు అందుకున్న లబ్ధిదారులు పలువురు మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలోనే సొంత ఇంటి కల నెరవేరుతుందని, చాలా సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు.ఇందిరమ్మ అంటేనే తల్లి అని తల్లి ఇంట్లోకి వెళ్తున్నట్లు తమ ఆనందాన్ని సంతోషాన్ని వెళ్ళబుచ్చారు.ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి మంత్రులకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. మాతోపాటు మా గ్రామంలో రానటువంటి కుటుంబాలకు కూడా ఇంట్లో మంజూరు చేయాలని మంత్రులకు మహిళలు విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రులు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముందుగా అమ్రాబాద్ వద్ద పీడబ్ల్యూ బీటీ రోడ్డు నిర్మాణానికి, గిరిజన భవన్ కు కాంపౌండ్ వాల్ ( ప్రహరీ గోడ) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఒక కోటి 97 లక్షలతో ప్రశాంత్ నగర్ బిటి రోడ్డుకు శంకుస్థాపన పనులను, 46.50 లక్షల రూపాయల లతో గిరిజన భవనం కాంపౌండ్ వాల్ మూత్రశాలల నిర్మాణానికి శంకుస్థాపన పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.అంతుకుముందు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణ రావు అమ్రాబాద్ మండలం మన్ననూర్ మృగవాణి గెస్ట్ హౌస్ వద్ద ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఇతర అధికారులు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో రెవిన్యూ అంశాలకు మంత్రి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ సహాయం అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, అత్యధిక సంఖ్యలో చెంచు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.