- హైదరాబాద్ అభివృద్దికి సరిపడా నిధులు లేవు.
- డ్రైనేజీ వ్యవస్థను జలమండలి, మున్సిపాలిటీలు పట్టించుకోవడం లేదు.
- తాగునీటి పైపులైన్లు సరిపోయేంతగా లేవు.
- జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం పనిచేయాల్సిన అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.గ్రామీణ పేదరికం కంటే పట్టణ పేదరకం ఎక్కువగా ఉందన్నారు.గ్రామాల్లో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్‌కి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. సుమారు 70 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే ప్రభుత్వానికి వస్తుందన్నారు.నగర జనాభా ప్రాతిపధికన హైదరాబాదులో ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నాం, రాష్ట్రమంతా ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నాం అనే రేషియో ప్రకారం చూడాలని ఆయన సూచించారు. హైదరాబాద్ అభివృద్ధికి సరిపోయే నిధులు కేటాయించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో నివసించే వారికి ఆ ప్రాంతంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి.లేదంటే వారి ఉపాధి పోతుందన్నారు, కట్టిన ఇల్లు ఇంకా కేటాయింపులు జరగలేదన్నారు. వాటిల్లో ఇప్పుడు ఉంటున్నవారికి ఉపాధి లేక ఇబ్బందిపడుతున్నారని అన్నారు. వేలకోట్ల రూపాయలు పెట్టి కట్టిన వాటికి..రోడ్లు లేవు, లైట్లు లేవన్నారు, డ్రైనేజీ పైప్లైన్లు లేవు, నీళ్ల కనెక్షన్ అసలే లేవన్నారు. కోట్ల రూపాయలు పెట్టి కట్టినవి నిరర్ధకంగా ఉంటున్నాయని, కమిటీ వేసి వెంటనే వాటికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.డ్రైనేజీ వ్యవస్థను జలమండలి వారు చూస్తారని మున్సిపాలిటీలు పట్టించుకోవడం లేదన్నారు.ఈ రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా నిపిస్తుందన్నారు,