Take a fresh look at your lifestyle.

సంగారెడ్డిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రోజు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జై శ్రీరామ్,జై…శ్రీరామ్ జైహనుమాన్ నినాదాలతో నగరాన్ని మార్మోగించారు.
శోభాయాత్ర సంగారెడ్డి బైపాస్ ప్రాంతానికి చేరుకోగా,హ్యాపీ డెంటల్ క్లినిక్ డా.శిల్పా ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బైక్ ర్యాలీగా వస్తున్న భక్తులకు వాటర్ బాటిల్స్,మజ్జిగ ప్యాకెట్లు, గ్లూకోజ్ పానీయాలు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
అదేవిధంగా కౌన్సిలర్ నవీన్ ఆధ్వర్యంలో శోభాయాత్రకు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.