ముద్ర ప్రతినిధి, హనుమకొండ: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో ఉన్న వెల్ నెస్ సెంటర్ లో మందుల కొరత తో వివిధ ఆరోగ్య సమస్యతో వచ్చే బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు మరియు పాత్రికేయుల ఆరోగ్య పథకం లో భాగంగా గత ఆరు సంవత్సరాల క్రితం కుమార్ పల్లి జంక్షన్ లోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని భవనం లో అన్ని ఏర్పాట్లు చేసి ప్రారంభించారు. ప్రారంభ సమయమయంలో వివిధ రంగాల్లోని పది మంది వైద్యనిపుణులు ఏర్పాటు చేయటంతో పాటు సిబ్బందిని సమకూర్చారు.వరంగల్ ఉమ్మడి జిల్లాలలోని ఉద్యోగస్తులు వివిధ ఆరోగ్య సమస్యలపై ప్రతి రోజు డాక్టర్ ఓ. పి కోసం రెండు వందల మంది వస్తున్న వెల్ నెస్ సెంటర్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఇక్కడ పరీక్షించు కొన్న వారికి డాక్టర్ రాసిన మందులు అందుబాటులో లేక పోవడం తో వచ్చిన బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా లోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే ఉద్యోగస్తులకు వైద్య సేవలు దొరికిన మందులు అందుబాటులో లేని విషం నిర్వహ అధికారిని సంప్రదిస్తే అందుబాటులో ఉన్న మందులను మాత్రమ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని అందుబాటులో లేని మందులను ప్రవేటు మెడికల్ షాప్ లో కొనుగోలు చేసుకోవాలని పూర్తి వివరాలు కావాలి అంటే హైదరాబాద్ లోని కార్యాలయంలో సంప్రదించాలని ఉచిత సలహా ఇస్తున్నారని బాధితులు ఆరోపించారు.ప్రతి నెల రావలసిన మందులు ప్రభుత్వ గోదాముల నుండి రాకపోవడం సంబధిత కాంట్రాక్టర్ మందులను సరఫరా చేయక పోవడం కారణంగా వెల్ నెస్ సెంటర్ కు మందులు సరఫరా కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.రాష్ట్రం లో హైద్రాబాద్ తరువాత హన్మకొండలో ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ ల పై రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకా పోవడం తో ఉద్యోగులు పాత్రికేయుల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఇప్పటికీ అయిన వెల్ నెస్ సెంటర్ కు నిపుణులు అయిన డాక్టర్ల తో పాటు సరిపడ మందులను సరఫరా చేయాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు.