Take a fresh look at your lifestyle.

సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సమావేశం

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి,
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టీఎన్జీవోస్) సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ అలీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా సంఘం ప్రతినిధులతో పాటు తాలూకా అధ్యక్షులు,కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు (మెంబర్షిప్) కార్యక్రమాన్ని వేగవంతం చేయడం పైవిస్తృతంగా చర్చించారు. ప్రతి తాలూకా స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, మరింత మంది ఉద్యోగులను సంఘంలో చేర్చేలా చర్యలు చేపట్టాలని అధ్యక్షులు సూచించారు.
అలాగే రాబోయే మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణపై చర్చించారు. జిల్లా, తాలూకా స్థాయిలలో సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించి, సంఘ ఐక్యతను చాటేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా మొహమ్మద్ జావిద్ అలీ మాట్లాడుతూ సంఘ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని, సంఘం ప్రతిష్టను మరింత పెంపొందించే దిశగా అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా కార్యదర్శి వేల్పూరు రవి మాట్లాడుతూ సంఘ ఐక్యతే ప్రధాన బలం అని, అందరూ కలిసి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఈసమావేశంలో అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్,వెంకట్ రెడ్డి,కోశాధికారి శ్రీనివాస్,భాస్కర్,ప్రమోద్, కృష్ణ,సుధామని,సుధారాణి, లక్ష్మి,కృష్ణ,షకీల్,సంపత్, ఆంజనేయులు,వెంకటేశం, యాదవ రెడ్డి,వెంకట్, మోబిన్,నరేందర్ గౌడ్, మిస్కిన్,నాగమణి,యోగేష్, నర్సింలు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.