ముద్ర, భువనగిరి ప్రతినిధి :
ఈ నెల 3వ తేదీ మంగళవారం మద్యాహ్నం గం.03.20 ని ల కు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం గం.6.47ని.ల వరకు గ్రస్తోదయ చంద్రగ్రహణం కారణంగా ప్రధానాలయములు, ఉప ఆలయములు, అనుబంధ దేవాలయములలో ఉదయము గం. 7.00ని.ల లోపు సుప్రభాతము, నిజాభిషేకము, అర్చనలు, బాలభోగము ముగించి దేవాలయం మూసివేయబడునని దేవస్థాన కార్యనిర్వాహణాధికారి జే. భవానీ శంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరుసటి రోజు తేది. 04.03.2026 బుధవారం రోజున ఉదయం గం.03.30ని.ల కు ప్రధాన ఆలయం, ఉప ఆలయములు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమములు నిర్వహించబడునని చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా తేది. 04.03.2026 రోజున శ్రీ స్వామి వారి ఆలయం, ఉప ఆలయములలో నిత్య కైంకర్యముల సమయ వేళలలో మార్పులు చేశామన్నారు.
03.03.2026 రోజున సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని శ్రీ స్వామి వారి సన్నిధిలో జరపబడు హోలికోత్సవము రద్దు పరచి ముందు రోజు తేది. 02.03.2026 సోమవారం రోజున సాయంత్రం. నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.