ముద్ర, వనపర్తి :
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ శిఖరాలకు చేరుకుంటుందని, కాంగ్రెస్ కే ప్రజాదరణ ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడం తో వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ లో ఆయన పాల్గొని అనంతరం పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పదివేల మందితో జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి మాట్లాడారు.కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు,ఉచిత కరెంటు,
మహిళలకు ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం,మహిళలకు వడ్డీ లేని రుణాలు,మహిళా సంఘాల, భాగస్వామ్యంతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు,మహిళలకు డీజిల్ బంకులు ఏర్పాటు,
మహిళల క్యాంటీన్ల ఏర్పాటు వంటివి ఈ రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన ఘనత అని జూపల్లి వెల్లడించారు.పాఠశాల విద్యార్థులకు మహిళా సంఘాలతోనే ఏకరూప దుస్తుల తయారీ,కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి శ్రీకారం చుట్టిందని,ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు.రైతులకు రుణమాఫీ,రైతు భరోసా,పండించిన పంటకు బోనస్ ఇలా రైతుల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని జూపల్లి పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఒక్కో రైతుకు లక్ష రూపాయల విలువ గల రాయితీలను ఎత్తేసి కేవలం రైతుబంధు మాత్రమే ఇచ్చిందన్నారు. నేడు గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్ల పండుగ నడుస్తున్నదని, పదేళ్ల కాలంలో ఏ ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపనా పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేసిందన్నారు.మోసపూరిత మాటలు నమ్మి ఎవరు కూడా ఇతర పార్టీలకు తమ అమూల్యమైన ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని జూపల్లి అన్నారు.కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పెబ్బేరు పట్టణ అభివృద్ధికి రూ. 24 కోట్లు తీసుకువచ్చి ప్రతి గల్లీ అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు.
రానున్న రోజుల్లో పెబ్బేరు మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ గా మారుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చిన్నరెడ్డి, శివసేనారెడ్డి,33 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.