Take a fresh look at your lifestyle.

జిల్లా ఆసుపత్రి నిర్వహణపై ఎమ్మెల్యే ఆగ్రహం వైద్యంపై డాక్టర్ల తీరు మారాలి: గండ్ర

 

మహదేవపూర్, ముద్ర:

జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆసుపత్రి సూపరింటెం డెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


బుధవారం ఆయనజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఆసుపత్రిని సందర్శించి, అన్ని విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని క్యాజువలిటీ, ల్యాబ్ , ఏం.ఆర్.ఐ, ఔట్ పేషెంట్ గదులు పరిశీలించి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాజువాల్టీలో 6 మంచాలు మాత్రమే ఉన్నాయని అత్యవసరంగా ఒకే సమయంలో ఎక్కువ మంది రోగులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలుపగా నూతనంగా 15 మంచాలతో ఒక క్యాజువాల్టీ నిర్మాణం చేపడతామని అంచనాలు తయారు చేసి ఇవ్వాలని టి.జి.ఎం.ఐ.డి.సి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ల్యాబ్ ను పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుద్యం సరిగా లేకపోవడం, వార్డులు మరియు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం గమనించిన ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందాల్సిన ప్రాథమిక సౌకర్యాలు సరిగా లేకపోవడం పట్ల
అలాగే సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణపై బాధ్యత వహిస్తున్న పర్యవేక్షకుడిని పునరావృతం కాకూడదన్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో పారిశుద్యాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, సిబ్బంది హాజరు, పనితీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి ఆవరణలోని మహిళా క్యాంటీన్ ను పరిశీలించి రోగి బంధువులతో మాటాడారు. క్యాంటీన్ లో పరిశుభ్రమైన నాణ్యమైన వంటకాలను అందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే క్యాంటీన్ లో టిఫిన్స్ రుచిచూశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆసుపత్రి పర్యవేక్షకులు డా రాజేంద్రప్రసాద్, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.