ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిటిజన్ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు వి. రాజశేఖర్ శర్మ, వెంకటయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు ఆరేళ్లుగా విడుదల కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికేట్లు ఇవ్వలేమని కళాశాల యాజమాన్యాలు చెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా ఫీజు బకాయిల విడుదలపై స్పష్టత లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజుల సమస్య కారణంగా కొన్ని కళాశాలలు తరగతులను బహిష్కరిస్తున్నాయని, తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.
కొంతమంది విద్యార్థులు చదువులతో పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాల వైపు మళ్లాల్సి వస్తోందని తెలిపారు.
అందువల్ల వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సిటిజన్ ఫోరం ప్రతినిధులు కోరారు. give me tags,permlink,withcomass in english