బోడుప్పల్, ముద్ర విలేకరి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నవంద రోజుల కార్యక్రమం అమలులో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం కార్పొరేషన్ అధికారులు వనమహోత్సవం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ లో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఇంటింటికి పూలు, పండ్ల మొక్కలను అందించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎ.శైలజ, స్థానిక మాజీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కార్పొరేషన్ శానిటరీ ఇన్ స్పెక్టర్ నారాయణ రెడ్డి, వార్డు ఆఫీసర్ వినయ్ కుమార్ రెడ్డి, స్థానిక ప్రజానీకం, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.