బీబీనగర్, ముద్ర విలేకరి: బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన గొలనుకొండ శశికళకు రాజనీతి శాస్త్రంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం పీహెచ్డీ ప్రదానం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లో మండళవారం సాయంత్రం జరిగిన 84వ స్నాతకోత్సవంలో ఆమె యూనివర్శిటీ ఛాన్స్ లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణు కుమార్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ ను అందుకున్నారు. ఈమె 2003లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచే రాజనీతి శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఆమె 2008లో బీఈడీ, తర్వాత 2015లో పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఎంఈడీ పూర్తి చేశారు. తర్వాత 2003లో రాజనీతి శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెడీని సాధించారు. “పాలిటిక్స్ ఇన్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ఇండియా… ఎ కేస్ స్టడీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ” అంశంపై ఆమె తన పరిశోధనా పత్రాలను సమర్పించి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు. పోలియో వ్యాధితో చనిపోయిన తన సోదరుడు శంకర్ కు ఈ పురస్కారాన్ని ఆమె అంకితం చేశారు. డాక్టరేట్ సాధించిన శశికళను గ్రామస్థులు అభినందించారు.