Take a fresh look at your lifestyle.

కొండారెడ్డిపల్లి లో భోజనం చేసిన జిల్లా కలెక్టర్

  • పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం “సన్న బియ్యం పంపిణీ.
  • నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

 ముద్ర,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో నాగనూలు లక్ష్మమ్మ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు ఇతర జిల్లా అధికారులతో కలసి, జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ భోజనం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాది పండుగ రోజున ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీతో ఇలాంటి పేదవారికి ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు.సన్నబియ్యంతో భోజనం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ద్యేయంగా ప్రజా ప్రభుత్వం ఆహార భద్రతా కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు.సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్ళలో ఆనందాన్ని స్వయంగా చూశానని జిల్లా కలెక్టర్ తెలిపారు. సన్నబియ్యం నాగనూలు లక్ష్మమ్మ లబ్దిదారుని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని, సంతృప్తి ఇచ్చిందని అన్నారు. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వ హిస్తున్నామని తెలిపారు.జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాకు చేరినట్లు తెలిపారు.ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీర్థప్రసాదాలు కలెక్టర్ స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.