Take a fresh look at your lifestyle.

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

  • ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత కలిగి ఉండాలని దానితోనే మానసిక ప్రశాంతత ఉంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.శనివారం కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆంజనేయ స్వామి జయంతిని పట్టణ ప్రజల సమక్షంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని అన్నారు.అంతకుముందుకు ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.