ముద్ర శ్రీరంగాపూర్
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సుజాత రాజశేఖర్ వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ ఆదర్శ సురభి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.గ్రామ అభివృద్ధికి సహకరించాలని, గ్రామంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ భరత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.